BALU TV: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో తెలంగాణ గురుకుల పాఠశాల మరియు కాలేజ్ గర్ల్స్ నందు జాతీయ వైజ్ఞానిక దినోత్సవం – 2025 సందర్భంగా సివి రామన్ వారి ఫోటోకు పూలమాలవేసి వారి సేవలను కొనియండుతూ విద్యార్థునులు వైజ్ఞానిక ప్రదర్శన మా ఏర్పాటు చేసి వారి కృషిని వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ కె. సరోజమ్మ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ, ఆధునిక భారతీయ విజ్ఞాన శాస్త్రవేత్తల పరిశోధనా ప్రతిభను అంతర్జాతీయ స్థాయిలో ఇనుమడింపజేసిన వ్యక్తుల్లో సీవీ రామన్ అగ్రగణ్యుడు. వైజ్ఞానిక ఆవిష్కరణల్లో భారతీయులకు నోబెల్ బహుమతి రావడం గగనం.. అలాంటిది సీవీ రామన్ ఆ ఘనత సాధించి సరికొత్త చరిత్రను లిఖించారు. అంతేకాదు, భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి అందుకున్న మొట్టమొదటి ఆసియా వాసిగా రికార్డు నెలకొల్పారు. విద్యార్థునులు శా(స్త్రీయ దృక్పథాన్ని పెంపొందించు కోవాలని, దేశ శాస్త్ర సాంకేతిక అభివృద్ధికి పాటు పడాలని వారిని కోరారు. అలాగే పాఠశాలలో నిర్వహించిన క్విజ్, చిత్రలేఖన, వ్యాసరచన, ఉపన్యాస పోటీలలో విజేతలైన వారికి అభినందనలు తెలియ చేశారు. కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ సైన్స్ డే సిబ్బంది. సైన్స్ డే ప్రముఖ్యతనూ వివరిస్తా శాస్త్రవేత్రాలను సరిస్తూ, వారిని సూర్తిగా తీసుకోవాలని -చెప్పటం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ వేతలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
చౌటుప్పల్ తెలంగాణ గురుకుల పాఠశాలలో మరియు కాలేజ్ గర్ల్స్ జాతీయ వైజ్ఞానిక దినోత్సవం
కళాశాల ప్రిన్సిపాల్ కె. సరోజమ్మ
152
previous post