BALU TV: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలోని ధర్మోజి గూడెం గ్రామ పంచాయతీ లో శ్రీ భవాని రామలింగేశ్వర స్వామి కళ్యాణం మహోత్సవం గత కొన్ని సంవత్సరాలుగా అనేక పూజలు అందుకుంటూ గ్రామంలో ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ప్రతి సంవత్సరం లాగే జాతర వేడుకలను ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. శ్రీ భవాని రామలింగేశ్వర స్వామి ఊదరి భీమయ్య సత్తమ్మ వారి కుమారుడు ఊదరి మురళి అరుణ దంపతులు అధ్వర్యంలో నిర్వహించనున్నారు అని తెలిపారు. తేదీ: 03,03. 2025 సోమవారం రోజున ఉదయం 05:30 గం.లకు సుప్రభాతం, ఉదయం 9:00 గంటలకు గణపతి పూల స్వస్తి వుశ్వాహావాదనం, అఖండ దీపారాధన, ధ్వజారోహనం, జరుపబడును. తేది: 04.03.2025 మంగళవారం రోజున ఉదయం 07:00 గం.లకు స్వామి వారికి రుద్రాభిషేకం, ఉ దయం 8:30 గం.లకు తద్ర హోమం, ఉదయం 11:45 గం ని.లకు శ్రీ భవాని రామలింగేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం అదేవిధంగా శ్రీ జమదగ్ని రేణుక ఎల్లమ్మ, వారుల భక్త కళ్యాణోత్సవం తదనంతరం మంగళహారతి, మంత్ర పుష్పలు, అన్ని సంతర్పణ కార్యక్రమం కళ్యాణ మహోత్సవం నిర్వహించు డుతుందని తెలిపారు. తేది: 05, 03. 2025 బుధవారు రోజున ఉదయం 04: 00 గం.లకు సుప్రభాతం, ఉదయం 5:00 గంటలకు అగ్ని గండాలు, ఉదయం 6:00 గంటలకు రామలింగేశ్వర స్వామి కళ్యాణ. మధ్యాహ్నం 2.00 గంటలకు శ్రీ రేణుక ఎల్లమ్మ బోనాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గ్రామంలోని ప్రతి ఒక్కరు సుభిక్షంగా ఉండాలని దేవుని యొక్క కరుణాకటాక్షాలు పొంది అష్ట ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండే విధంగా దేవుని కళ్యాణం జరుపుకుందాం ప్రతి ఒక్కరు సహకరించి కమనీయంగా జరిగేటు వంటి కళ్యాణానికి ప్రతి ఒక్కరు హాజరు కావాలని ఊదరి భక్త కమిటీ తెలిపారు.
3వ తేది నుండి 5వ తేది వరకు ధర్మోజి గూడెంలో శ్రీ భవాని రామలింగేశ్వర స్వామి జాతర
4వ తేదిన స్వామి వారి కళ్యాణం చూద్దాం రారండి
195