BALU TV: రోడ్డు ట్రాన్స్పోర్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని హైదరాబాద్ ధర్నాకు వెళ్తున్న కార్మికులను అర్ధరాత్రి అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఖండించాలని సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు కడం లింగయ్య అన్నారు. శుక్రవారం తిరుమలగిరి మండల కేంద్రంలో రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్మికులను ఎలాంటి సమాచారం లేకుండా అర్ధరాత్రి అరెస్టు చేయడాన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ట్రాన్స్పోర్ట్ కార్మికుల ధర్నా కు తిరుమలగిరి నుడి వెళ్తున్న కార్మికులను పోలీస్ స్టేషన్లో ముందస్తు అరెస్టు చేయడం సూచనియం అని వారు అన్నారు.ప్రభుత్వానికి కార్మికుల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్న కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు కడెం లింగయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హమాలీ కార్మికులకు వెల్పర్ బోర్డ్ కార్డు మెడికల్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ అదేవిధంగా భవన నిర్మాణ కార్మికులకు వెల్ఫేర్ బోర్డులో పెండింగ్లో ఉన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలనీ కోరారు. ప్రభుత్వమే కార్మికులను గుర్తించి గుర్తింపు కార్డులు ఇవ్వాలనీ. ప్రమాద జీవో కార్మికులకు వర్తించే విధంగా చూడాలనీ, అసంఘటిత రంగ కార్మికులందరికీ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు, ఇంటి స్థలం ఉన్న వారికి ఐదు లక్షల రూపాయలు , ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు వర్తించే విధంగా చూడాలని సిపిఎం పార్టీ గా డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలన్నీ తక్షణమే పరిష్కరించకపోతే హైదరాబాద్ ఇంద్ర పార్క్ వద్ద ధర్నా కాదు అసెంబ్లీ ముట్టడిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల అధ్యక్షులు పానగంటి శీను, సిఐటియు నాయకులు దాసరి ప్రకాష్ ,నిర్మల యకయ్య,నాగేష్ తదితరులు పాల్గొన్నారు.
రోడ్డు ట్రాన్స్పోర్ట్ కార్మికులను ముందస్తు అరెస్టు చేయడాన్ని ఖండించండి.
సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు కడెం లింగయ్య
200
previous post