BALU TV: బీసీలను రాజకీయంగా ఎదగకుండా అణచివేయడానికి కుట్రలు జరుగుతున్నాయని గురువారం నాడు బిసి యువజన సంఘం మునుగోడు నియోజకవర్గం అధ్యక్షులు వీరమళ్ళ కార్తీక్ గౌడ్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వం సమగ్ర కులగణన సర్వే నిర్వహించి బీసీల వివరాలు తక్కువ చేసి చూపించడం
బిసి లను అవమానించడమేనని అన్నారు. గత ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించి అందులో బీసీ జనాభా 51% అని చెప్పి వారి యొక్క వివరాలు ప్రభుత్వ వెబ్సైట్లో పెట్టడం జరిగింది. ఆ సర్వే చేసి 11 సంవత్సరాలు అయినా ఆ శాతం, పెరగాలి తప్ప తక్కువ కావడం అనుమానాలను కలుగజేస్తుందన్నారు. బీసీ లెక్కలను తక్కువ చేసి అగ్ర కులాల జనాభా ను ఎక్కువ చేసి చూపించడం ఇది బీసీ లను అమనిచడమే.
ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల ను కాపాడడం కోసం లేని అగ్రకులాల జనాభా ను చూపించడం పెద్ద కుట్ర. బిసిలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ భారీ మూల్యం చెల్లించక తప్పదు. ఇకనైనా ప్రభుత్వం రెండో విడత సమగ్ర కులగణన జరిపి సర్వేలో పాల్గొనని వారికి అవకాశం కల్పించి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కోరారు.