విశాఖపట్నం: పెందుర్తి, గాంధీనగర్ పరిసరప్రాంతాలలో చీటీలు, ఇంకా దసరా, సంక్రాంతి, వరలక్ష్మి వ్రత చీటీ, సాయిరాం గోల్డ్ లక్కీ డ్రా మొదలగు స్కీమ్ లలో అధిక లాభాలు ఆశ చూపి మధ్యతరగతి వాళ్లం అయిన సుమారు 540 మంది వద్ద నుండి డబ్బులు వసూలు చేసి రూ.14 కోట్లు మేర మోసం చేసిన ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి, సివిల్ కాంట్రాక్టర్ సిల్లా ప్రసాదరావు కుమార్తె కంచి మాధవి , ఆమె కుటుంబ సభ్యులు నుండి మా బాధితులు అందరికి న్యాయం చేయవలసిందిగా బాధితులు కోరారు.
ఈమేరకు మీడియా సమక్షంలో సదరు విషయాలను/వివరాలను తెలియజేయుటకు సోమవారం ఉదయం డాబాగార్డెన్డ్స్ వి జే ఎఫ్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించారు. కొలుపూరి నారాయణమ్మ , మాట్లాడుతూ, ప్రసాద రావు రావు, విజయ లక్ష్మి, దంపతులు కుమార్తె మాధవి 2018 నుంచి చీటీలు నిర్వహిస్తున్నారు. గత ఏడాది డిసెంబర్ నుంచి లబ్దిదారులకు చెల్లింపులు ఆపేసారు. స్థలాలు అమ్మి డబ్బులు ఇస్తానన్నారు. కానీ, 19 మందికి ఐ పినోటీసులు ఇచ్చారు. ఆగస్టు 5 న ఫిర్యాదు, రిమాండ్ వేశారు. అలాగే, 13 న బెయిల్ మీద వచ్చారు. ఎస్సీ, ఎస్టీ లను తమ బాధితుల మీద ఉదిగోల్పుతున్నారు. ముగ్గురు నిందితులు ఇంకా పరారీలో ఉన్నారు.
అందరూ మద్య తరగతి ప్రజలే చీటీలు వేశారు అన్నారు. 2022 నుంచి వరలక్ష్మి వ్రతం చీటీలు, సంక్రాంతి చీటీలు కట్టమని అన్నారు. ప్రసాద రావు ఇంటిపై గతంలో వైసిపి, ఇప్పుడు జన సేన పార్టీ జెండా ఎగురుతున్నాయి అన్నారు. మూడు నెలలకో కొత్త కారు కొంటారు అని గుర్తు చేశారు. ప్రసాద రావు అస్తులు వేలం వేసి ప్రభుత్వం బాధితులు డబ్బులు వాపసు చేయాలని ఆమె కోరారు. పీలా జ్యోతి మాట్లాడుతూ, తనకు 15 లక్షలు 5 లక్షలు మాత్రమే ఇచ్చారు. మరో రెండు నెలలు ఆగితే డబ్బులు ఇస్తాం అని మభ్యబెట్టారు. బ్యాంకు రుణం తీసుకుని మరీ చీటీలు కట్టాను అన్నారు. బాధితులను బెదిరిస్తున్నారు. ప్రజలు అనధికార చీటీలు వేయొద్దూ అని కోరారు. మీడియా సమావేశంలో అధిక సంఖ్యలో బాధితులు పాల్గొన్నారు.