BALU TV: యాదాద్రి భువనగిరి జిల్లా, చౌటుప్పల్ పట్టణ మున్సిపాలిటీ పరిధిలోని స్థానిక మాతృశ్రీ డిగ్రీ కళాశాలలో నేడు సావిత్రి బాయి పూలే జయంతి సందర్భంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు….
ఈ సందర్భంగా కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ జి.శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులు భారతీయ సమాజానికై సేవలు అందించిన మహనీయులను స్మరించుకుంటూ వారి అడగుజాడలో నడవాలని సూచించారు.మరియు సావిత్రి బాయి పూలే చిత్రపటానికి పూలమాల సమర్పించారు.
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ బి. మహేందర్ రెడ్డి అధ్యాపక బృందం మరియు విద్యార్ధిని విద్యార్థులు పాల్గొన్నారు